చిలకలూరిపేట: మద్ది నగర్ లోని మస్జిద్ ఉమర్ బజారు నందు. హుదా సొసైటీ ఆధ్వర్యంలో పేదలు, వితంతువులకు బియ్యం పంపిణీ కార్యక్రమం ఘనంగా ...
చిలకలూరిపేట: మద్ది నగర్ లోని మస్జిద్ ఉమర్ బజారు నందు. హుదా సొసైటీ ఆధ్వర్యంలో పేదలు, వితంతువులకు బియ్యం పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా మొహమ్మద్ అబ్బాస్ ఖాన్ మాట్లాడుతూ, పవిత్రమైన రంజాన్ నెల పురస్కరించుకొని అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. పవిత్ర రంజాన్ నెలలో ఉపవాస దీక్ష పాటిస్తున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్ర రంజాన్ నెల పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన మాసముగా నిలుస్తుంది. ఈ సందర్భంగా ఆ దేవుడు అందరిపై శుభాలు కలుగజేయాలని, ప్రపంచమంతా శాంతితో వర్ధిల్లాలని,ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశం శాంతికి చిహ్నంగా ఉండాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చల్ల విజయ్ కుమార్ , మాజీ వైస్ కౌన్సిలర్ వేటపాలెం సుభాని , షేక్ సర్దార్ పాషా మరియు మస్జిద్ ఉమర్ కమిటీ సభ్యులు,హుదా సొసైటీ వాలంటీర్లు పాల్గొన్నారు.
COMMENTS