చిలకలూరిపేట పట్టణంలో శ్రీ శారద జిల్లా పరిషత్ హై స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న 161 మంది విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల సందర్భంగా ...
చిలకలూరిపేట పట్టణంలో శ్రీ శారద జిల్లా పరిషత్ హై స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న 161 మంది విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల సందర్భంగా అవసరమైన పరీక్షా సామగ్రిని అందజేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు జనసేన నాయకులు మండలనేని చరణ్ తేజ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్యాడ్, పెన్, స్కేలు వంటి పరీక్షా సామగ్రిని అందించారు.
ఈ సామగ్రిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే.రత్నజ్యోతి విద్యార్థినీ-విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మండలనేని చరణ్ తేజ విద్యార్థులు రాబోయే పబ్లిక్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్‌పర్సన్ పిల్లి ధనలక్ష్మి, తోట వెంకట సురేష్, తూబాటి పరమేశ్వరి, ముత్తంశెట్టి ప్రసాద్, తోట మల్లికార్జునరావు,నల్లమల్ల ఉదయలక్ష్మి,వట్టిప్రోలు శ్రావణి తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం ముగింపులో పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయులు కే.రత్నజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
COMMENTS