చిలకలూరిపేట: స్థానిక లీలావతి హాస్పిటల్స్‌లో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో ఒక మహిళకు అత్యంత క్లిష్టమైన మొత్తం...
చిలకలూరిపేట: స్థానిక లీలావతి హాస్పిటల్స్‌లో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో ఒక మహిళకు అత్యంత క్లిష్టమైన మొత్తం లాపరోస్కోపిక్ హిస్టెరెక్టమీ (TLH) శస్త్రచికిత్సను వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది. గర్భాశయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న బాధితురాలికి, ఎటువంటి పెద్ద కోతలు లేకుండా కేవలం చిన్న రంధ్రాల ద్వారా (కీ-హోల్ సర్జరీ) ఈ ఆపరేషన్ పూర్తి చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ లావు సుష్మ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన లాపరోస్కోపీ విధానం వల్ల రోగికి రక్తస్రావం తక్కువగా ఉంటుందని, శస్త్రచికిత్స అనంతరం నొప్పి తక్కువగా ఉండి అతి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అత్యాధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో ఈ చికిత్సను విజయవంతం చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
COMMENTS