నిరుద్యోగ యువతకు 15 వేల జీతంతో ఉద్యోగ అవకాశాలు! చిలకలూరిపేట: పట్టణ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభ...
నిరుద్యోగ యువతకు 15 వేల జీతంతో ఉద్యోగ అవకాశాలు!
చిలకలూరిపేట: పట్టణ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, చిలకలూరిపేటలో త్వరలో ప్రారంభమయ్యే D-Mart బ్రాంచ్‌లో ఖాళీలు భర్తీ చేయడానికి ఈ నెల 24.02.2026న భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.క్యాషియర్లు, సేల్స్ అసోసియేట్లు, ప్యాకర్లు, సెక్యూరిటీ గార్డుల వంటి పలు పదవుల్లో నియామకాలు జరగనున్నాయి. SSC మరియు అంతకంటే ఎక్కువ విద్యార్హతలు ఉన్న 18-25 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు (పురుషులు, స్త్రీలు) అర్హులు. జీతం నెలకు 15,000 రూపాయలు.ఆసక్తి గలవారు తమ విద్యార్హత పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరుకోవాలని అధికారులు సూచించారు. సంప్రదించండి: 7702921219, 9848793357.
రిజిస్ట్రేషన్ లింక్: https://forms.gle/AgrbKkrabiRToyot9.
సొంత ఊరిలోనే ఉద్యోగం పొందే ఈ అవకాశాన్ని అర్హ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
COMMENTS