జాతీయ రహదారి 167 /ఎకి భూములిచ్చిన విప్పర్ల, పురుషోత్తపట్నం, మాచవరం, కావూరు గ్రామాల రైతులకు పరిహారం వెంటనే జమ చేయాలని జిల్లా కలెక...
జాతీయ రహదారి 167 /ఎకి భూములిచ్చిన విప్పర్ల, పురుషోత్తపట్నం, మాచవరం, కావూరు గ్రామాల రైతులకు పరిహారం వెంటనే జమ చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. పరిహారం విషయంలో రైతుల ఆందోళనలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
అదే విధంగా ఫిబ్రవరి 20 నాటికి నరసరావు పేట మండలం పరిధిలో రావిపాడు, కేశానుపల్లి రైతుల పరిహారం అంశాన్ని కొలిక్కి తీసుకురావాలన్నారు.
శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో 167 ఏ జాతీయ రహదారి నిర్మాణంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంజన సింహా , ఎన్.హెచ్ 167/ఎ ఈ.ఈ శ్రీనివాస్, నరసరావుపేట తహశీల్దార్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS