చిలకలూరిపేట: పట్టణం చుట్టుపక్కల గ్రామాలకు ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం. నిత్యం వేల సంఖ్యలో ప్రజలు ఇక్కడి హోల్సేల్ దుకాణాలపై ఆధారపడత...
చిలకలూరిపేట: పట్టణం చుట్టుపక్కల గ్రామాలకు ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం. నిత్యం వేల సంఖ్యలో ప్రజలు ఇక్కడి హోల్సేల్ దుకాణాలపై ఆధారపడతారు. అయితే, నమ్మకంతో వచ్చే వినియోగదారులను కొందరు వ్యాపారులు నిలువునా ముంచుతున్నారు. తూనికలు, కొలతల్లో భారీగా వ్యత్యాసాలు చూపిస్తూ సామాన్యుడి శ్రమను దోచుకుంటున్నారు.
తూనికల్లో మాయాజాలం...
గొట్టిపాడుబాధితుడి....
తాజాగా చిలకలూరిపేట మండలం గొట్టిపాడు గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి ఎదురైన అనుభవం ఈ అక్రమాలకు అద్దం పడుతోంది. హోల్సేల్ దుకాణంలో నిత్యవసర సరుకులు కొనుగోలు చేసిన సదరు వ్యక్తికి, దుకాణదారుడి కాటాపై చూపిన బరువుకు బయట చూసిన బరువుకు పొంతన లేకపోవడంతో మోసం వెలుగుచూసింది.దుకాణంలో కొలత కిలో సరుకుగా విక్రయం.బయట పరీక్షించినప్పుడు: కేవలం 920 గ్రాములు.ముద్ర కాటాలో తనిఖీ సుమారు 80 నుండి 100 గ్రాముల వరకు తక్కువగా రావడం గమనార్హం.
నిలువు దోపిడీకిలోకు వంద గ్రాముల కోత....
ఒక్కో వ్యక్తి వద్ద కిలోకు 100 గ్రాముల చొప్పున తగ్గిస్తే, 5 కిలోలు కొనే వ్యక్తి ఒక కిలో సరుకును నష్టపోతున్నాడు. రోజుకు వేల సంఖ్యలో వచ్చే వినియోగదారుల నుండి ఈ రకంగా లెక్కగడితే, వ్యాపారులు అక్రమ మార్గంలో సంపాదిస్తున్న లాభం అక్షరాలా లక్షల్లో ఉంటుంది. "లాభసాటి భైరవుల" తీరుతో పల్లె ప్రజలు విలవిలలాడుతున్నారు.
అధికారుల తీరుపై విమర్శలు తూతూమంత్రంగా తనిఖీలు...
వినియోగదారులను కాపాడాల్సిన తూనికలు, కొలతల శాఖఅధికారులు తమ బాధ్యతను విస్మరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.నామమాత్రపు దాడులు ఏదో ఒకరోజు పట్టణానికి వచ్చి, తూతూమంత్రంగా తనిఖీలు చేసి వెళ్తున్నారనిప్రజలువాపోతున్నారు.మామూళ్ల మత్తు పెద్ద హోల్సేల్ వ్యాపారుల వద్దకు వెళ్లకుండా, కేవలం చిన్న చిన్న బడ్డీ కొట్టులను టార్గెట్ చేసి కేసులు రాస్తున్నారని, పెద్దల వద్ద 'మామూళ్లు' అందుకొని మౌనం వహిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.డిజిటల్ కాటాలను ఎప్పటికప్పుడు రీ-వెరిఫికేషన్ చేయించడంలో అధికారులు విఫలమవుతున్నారు.
ప్రజల డిమాండ్ పారదర్శకత కావాలి..
హోల్సేల్ దుకాణాల వద్ద తూనికల శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించాలని బాధితులు కోరుతున్నారు. ప్రతి దుకాణం వద్ద వినియోగదారుల ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నంబరు లేదా అధికారుల ఫోన్ నంబర్లు ప్రదర్శించాలని, మోసాలకు పాల్పడే వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
COMMENTS