పల్నాడు: మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ లో జరుగుతున్న ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని...
పల్నాడు: మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ లో జరుగుతున్న ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లు పైన అధికారులతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రభలు తరలింపుకు ఎటువంటి అంతరాయం కలగకుండా రోడ్లను తీర్చిదిద్దాలన్నారు. ప్రభల రాకపోకలకు విద్యుత్ వైర్లు తగలకుండా చర్యలు తీసుకోవాలి అన్నారు.పారిశుధ్య నిర్వహణ మరియు మంచినీటి సరఫరాను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఎప్పటికప్పుడు పడిన వ్యర్ధాలను తీసే విధంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. క్యూలైన్లో ఉండే భక్తులకు మంచినీళ్లు ప్యాకెట్లు అందజేయాలని కోరారు.కొండ క్రింద నుండి కొండపై వరకు భక్తుల తరలింపుకు ఘాట్ రోడ్డుకు అనువైన అవసరమైన బస్సులను ఏర్పాటు చేయాలన్నారు.ఈ సంవత్సరం భక్తుల ఎక్కువగా వస్తారని వారికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
COMMENTS