ఎడ్లపాడు: మండల పరిధిలోని దింతెనపాడు గ్రామంలో ఫిబ్రవరి 11న వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు.ముఖ్య ...
ఎడ్లపాడు: మండల పరిధిలోని దింతెనపాడు గ్రామంలో ఫిబ్రవరి 11న వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు.ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసరావుపేట డాట్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.నగేష్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు.పత్తి పంట కాల అనంతరం కట్టెలను పొలంలోనే తగలేయకూడదని, షెడర్ యంత్రంతో సన్న ముక్కలు చేసి డికంపోజర్ 'ఏ' మరియు 'బి'లను 200 లీటర్ల నీటిలో కేజీ చొప్పున కలిపి తైవాన్ స్ప్రేయర్ తో పిచికారి చేసి గొర్రుతో నేలలో కలపాలని సూచించారు. ఇలా చేస్తే భూమిలో పోషకాలు, సూక్ష్మజీవులు, ఆర్గానిక్ కార్బన్‌లు సమృద్ధిగాఉంటాయని వివరించారు. శనగపంట నుర్పిడి తర్వాత కూడా ఇలాంటి పద్ధతి అనుసరించి రోటోవేటర్‌తో కలపాలని, కట్టె కుళ్ళిలోని పోషకాలు నేలకు చేరి పంటలకు ఉపయోగపడతాయని తెలిపారు.ఈ పద్ధతితో భూ భౌతికసూక్ష్మజీవులు అభివృద్ధి చెంది నేల సారవంతమవుతుందని చెప్పారు. డికంపోజర్ 'ఏ', 'బి' పొడులు అమరావతి పరిశోధన కేంద్రం వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
మండల వ్యవసాయ అధికారి ఏ. హరి ప్రసాద్ మాట్లాడుతూ, మొక్కజొన్న పంటలో కాంప్లెక్స్ ఎరువులను విత్తిన నెల రోజుల తర్వాతవాడకూడదని సూచించారు. సూటి ఎరువులైన యూరియా 50 కేజీలు, పోటాష్ 25 కేజీలు ఎకరానికి 40-45 రోజుల తర్వాత ఒకసారి, 60-65 రోజుల తర్వాత మరోసారి వేయాలని రైతులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు అనుపమ, బిలాల్ తదితర రైతులు పాల్గొన్నారు.
COMMENTS