ఎడ్లపాడు: విధి నిర్వహణలో ఉంటూనే ఆపదలో ఉన్న యువకుడిని కాపాడి చిలకలూరిపేట విద్యుత్ శాఖాధికారులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. చిలక...
ఎడ్లపాడు: విధి నిర్వహణలో ఉంటూనే ఆపదలో ఉన్న యువకుడిని కాపాడి చిలకలూరిపేట విద్యుత్ శాఖాధికారులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. చిలకలూరిపేట డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్. అశోక్ కుమార్, ఎడ్లపాడు అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ సురేంద్రలు విద్యుత్ బిల్లుల వసూలు నిమిత్తం బోయపాలెం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మార్గమధ్యలో టిడ్కో గృహసముదాయంలో నివసించే ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో పడి ఉండటాన్ని గమనించిన అధికారులు, వెంటనే స్పందించారు.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, బాధితుడిని సకాలంలో వైద్యశాలకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాపాయం తప్పించిన అశోక్ కుమార్, సురేంద్రలను స్థానికులు అభినందించారు.
COMMENTS