చిలకలూరిపేట పట్టణంలో బాల కార్మిక మరియు వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలనలో భాగంగా కార్మిక శాఖ అధికారులు గురువారం విస్తృత తనిఖీలు నిర...
చిలకలూరిపేట పట్టణంలో బాల కార్మిక మరియు వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలనలో భాగంగా కార్మిక శాఖ అధికారులు గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. చిలకలూరిపేట పట్టణంలోని పలు హోటల్లు, బైక్ మెకానిక్ షాపులు, దుకాణాలపై అధికారులు ఆకస్మిక తనిఖీ చేసి, అక్కడ పని చేస్తున్న వారి వివరాలను సేకరించారు.ఈ సందర్భంగా దుకాణాల యజమానులతో ప్రత్యేకంగా సమావేశమై, చిన్న పిల్లలను పనుల్లో పెట్టుకోవడం వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులపై వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. 18 ఏళ్లలోపు పిల్లలను పనిలో చేర్చుకోవడం నేరమని,నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.ఈ తనిఖీకార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ (ACL) షేక్ సుభాని, చిలకలూరిపేట అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ALO) విష్ణు, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ సుధాకర్, డిసిపియు (DCPU) అధికారి ప్రశాంతి, నీడ్స్ ఎన్జీవో ప్రతినిధి ప్రేమ్ కుమార్ మరియు కార్మిక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.బాల కార్మిక రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు ఈ సందర్భంగా కోరారు.
COMMENTS