చిలకలూరిపేట: స్థానిక లీలావతి హాస్పిటల్స్‌లో అధునాతన వైద్య సదుపాయాలతో కూడిన ప్రసవం విజయవంతమైంది. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు...
చిలకలూరిపేట: స్థానిక లీలావతి హాస్పిటల్స్‌లో అధునాతన వైద్య సదుపాయాలతో కూడిన ప్రసవం విజయవంతమైంది. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో ఒక మహిళకు శస్త్రచికిత్స నిర్వహించగా, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
విజయవంతంగా రిపీట్ ఎలక్టివ్ ఎల్ ఎస్ సి ఎస్ శస్త్రచికిత్స..
గతంలో సిజేరియన్ అయిన నేపథ్యంలో, ఈసారి కూడా వైద్య నిపుణులు రిపీట్ ఎలక్టివ్ ఎల్ ఎస్ సి ఎస్ (Repeat Elective LSCS) పద్ధతిలో ప్రసవం చేయాలని నిర్ణయించారు. డాక్టర్ లావు సుష్మ నేతృత్వంలోని వైద్య బృందం ఎంతో చాకచక్యంగా ఈ శస్త్రచికిత్సను పూర్తి చేశారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రసవం జరగడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
3.3 కిలోల బరువుతో ఆరోగ్యంగా శిశువు..
జన్మించిన ఆడబిడ్డ 3.3 కిలోల బరువుతో ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఉండాల్సిన బరువుతో పుట్టడం వల్ల శిశువు ఎదుగుదల బాగుంటుందని వైద్యులు పేర్కొన్నారు.
మెరుగైన వైద్య సేవలకు నిలయంగా లీలావతి హాస్పిటల్స్...
చిలకలూరిపేట పరిసర ప్రాంత ప్రజలకు లీలావతి హాస్పిటల్స్ నాణ్యమైన వైద్య సేవలను అందిస్తోందని ఈ సందర్భంగా యాజమాన్యం తెలిపింది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, అత్యవసర ప్రసవ కేసులలో డాక్టర్ లావు సుష్మ అందిస్తున్న సేవలు ఎంతో మందికి భరోసానిస్తున్నాయి.
COMMENTS