లీలావతి హాస్పిటల్స్.. చిలకలూరిపేట పట్టణంలోని లీలావతి హాస్పిటల్స్ మహిళా కవచ్ కేంద్రం లో డాక్టర్ లావు సుష్మ సంక్లిష్ట పరిస్థితుల...
లీలావతి హాస్పిటల్స్..
చిలకలూరిపేట పట్టణంలోని లీలావతి హాస్పిటల్స్ మహిళా కవచ్ కేంద్రం లో డాక్టర్ లావు సుష్మ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఒక గర్భిణికి అత్యంత నైపుణ్యంతో సాధారణ ప్రసవం చేశారు.సదరు మహిళకు ఇది రెండవ గర్భం (G2P1L1). ఆమెకు గతంలో కూడా సాధారణ ప్రసవమే జరిగింది. అయితే, ప్రస్తుతం ఆమె గర్భాశయంలో ఉమ్మనీరు తక్కువగా ఉండే ఒలిగోహైడ్రామ్నియోస్ (Oligohydramnios) అనే సమస్య ఉన్నప్పటికీ, డాక్టర్ సుష్మ పర్యవేక్షణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా డెలివరీ పూర్తయింది.ఆమె 3 కిలోల బరువున్న ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అతి తక్కువ ఉమ్మనీరు ఉన్న పరిస్థితుల్లో కూడా సిజేరియన్ అవసరం లేకుండా నార్మల్ డెలివరీ చేయడం పట్ల రోగి కుటుంబ సభ్యులు డాక్టర్ లావు సుష్మకు కృతజ్ఞతలు తెలిపారు.
COMMENTS