చిలకలూరిపేట: పట్టణంలోని ప్రముఖ వైద్యశాల లీలావతి హాస్పిటల్స్ లో గురువారం తెల్లవారుజామున పలువురు రోగులకు శస్త్రచికిత్సలు విజయవంతంగ...
చిలకలూరిపేట: పట్టణంలోని ప్రముఖ వైద్యశాల లీలావతి హాస్పిటల్స్ లో గురువారం తెల్లవారుజామున పలువురు రోగులకు శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లలో (OT) ఈ చికిత్సలు జరిగాయి.ముఖ్యంగా, చంక భాగంలో వచ్చే గడ్డలకు సంబంధించి I & D (Incision and Drainage) ప్రక్రియను డాక్టర్ సుష్మ బృందం విజయవంతంగా పూర్తి చేసింది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా, అత్యాధునిక వసతులతో ఈ శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రోగుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
COMMENTS