మహాశివరాత్రి పర్వదినానికి ముందుగా వచ్చే మాఘ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ దైవ క్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర ...
మహాశివరాత్రి పర్వదినానికి ముందుగా వచ్చే మాఘ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ దైవ క్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కోటప్పకొండ చుట్టుపక్కల గ్రామాల ప్రజలతోపాటు పట్టణం మరియు వినుకొండ ఒంగోలు చిలకలూరిపేట సత్తెనపల్లి నియోజకవర్గం భక్తులు వేలాదిగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మొక్కుబడి ప్రభలు ఉదయానించే కొండకు చేరుకున్నాయి చిన్న చిన్న ప్రబులు సైతం మంచి అలంకరణతో రూపుదిద్దుకొని స్వామివారి చెంతకు తీసుకువచ్చారు చేదుకో కోటయ్య ఆదుకో కోటయ్య, ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర నినాదాలతో కొండ ప్రాంతం హోరెత్తిపోయింది. మహిళలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు రాగి చెట్టు వద్ద పూజలు నిర్వహించి దీపారాధనను వెలిగించారు. మరి కొంతమంది పొంగళ్ల షెడ్డులో స్వామివారికి పొంగలి నైవేద్యంగా వండుకొని స్వామివారికి సమర్పించారు. స్వామివారికి విశేషాలు అభిషేక మండపము నందు నిర్వహించారు.
తెల్లవారుజామున ఈసారి రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ అంచలంచెలుగా క్రౌడ్ పెరిగి ఒంటిగంటకు భారీగా తరలివచ్చారు. అధికారుల అంచనా ప్రకారం సుమారు 35000 మంది స్వామివారిని దర్శించుకున్న. ముఖ్యంగా ఏకాదశి తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ బిందె తీర్థంతో ఆలయ ప్రవేశం చేసి మహాశివరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు చాంబర్ ఆఫ్ కామర్స్ పలు వ్యాపార సంస్థలు కొండపై భాగంలో అల్పాహారం పులిహార పండ్లు మంచినీళ్ల బాటిల్లు మజ్జిగ పంపిణీ చేశారు. శివ కుటుంబం వద్ద మేధా దక్షిణామూర్తి విగ్రహం నందీశ్వరుని విగ్రహం వినాయకుని విగ్రహం విష్ణు విగ్రహం వద్ద సెల్ఫీలు తీసుకొని వారి చిత్రాలను మొబైల్లో బంధించుకున్నారు. ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన వివిధ రకాల క్యూ లైన్ లో భక్తులు దర్శనం చేసుకున్నారు భక్తులు కావలసిన సకల ఏర్పాట్లు ఆలయ అధికారులు సిద్ధం చేసి మంచినీరు మజ్జిగ చిన్నారులకు పాలు అందజేశారు.ఈ సంవత్సరం కొంతమంది ఔత్సాహిక భక్తులు త్రికోటేశ్వర స్వామి దర్శనం తో పాటు రుద్ర శిఖరం పై ఉన్న పాతకోటయ్య స్వామిని విష్ణు శిఖరం పై ఉన్న పాప విమోచన స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ శివ భక్తులు ఇండ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వారి మిత్రబృందం అంతా కలిసి పాతకోటయ్య స్వామి వద్ద పాప విమోచన స్వామి వద్దకు చేరే మార్గాలను శుభ్రం చేయటం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచినీళ్లు అల్పాహారాలు ఏర్పాటు చేయించారు పాప విమోచన స్వామి ఆలయం వద్ద ప్రత్యేక షెడ్యూల్ నిర్మించారు అలానే స్వామి వారి ఆలయానికి శాశ్వత ప్రాతిపదికన విద్యుత్ సరఫరా ఏర్పాటు చేశారు ఇకపై నిత్యం దర్శనం చేసుకునే విధంగా రోడ్డు మార్గం ఏర్పడబోతోంది. ఎస్పి బి.కృష్ణారావు ఆదేశాల మేరకు డిఎస్పి ఎం హనుమంతరావు పర్యవేక్షణలో పోలీసులు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
COMMENTS