చిలకలూరిపేట మండలం, రాజాపేట గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల (బాలురు) లలో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి లోని అన్ని స...
చిలకలూరిపేట మండలం, రాజాపేట గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల (బాలురు) లలో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి లోని అన్ని సీట్లకు (80) మరియు 6,7,8 వ తరగతులలో మిగిలి ఉన్న సీట్ల ప్రవేశానికి విద్యార్థుల నుండి దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారి పివిజె రామారావు మరియు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల జిల్లా కన్వీనర్ & ఏపీ ఆర్ ఎస్ సి ఏ టి -2026 ఎగ్జామ్ కోఆర్డినేటర్ వి.వి.ఎస్. బ్రహ్మాజీ ఒక ప్రకటనలో తెలిపారు.ఆసక్తిగల విద్యార్థులు మార్చి నెల 31వ తేదీ లోపు http://aprs.apcff.in ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు 24-04-2025 న జరుగుతుందని తెలిపారు. ఆంగ్ల మాధ్యమం లో విద్యాబోధన, ఉత్తమ ప్రమాణాల కలిగిన విద్య, పౌష్టికాహారం మరియు వసతి సదుపాయాలు పూర్తిగా ఉచితం. మరిన్ని వివరాలు 87126 25040 నంబర్ సంప్రదించవలెను. అలాగే పదవ తరగతి పూర్తయిన విద్యార్థులకు ఏపీఆర్టేసీ మరియు ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు ఏపిఆర్డిసి లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము.
COMMENTS