డోకిపర్రు,ఎడ్లపాడు సెక్షన్ల సమస్యలకు తక్షణ పరిష్కారం.. చిలకలూరిపేట: విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక, విజయవాడ ఆధ్వర్యంలో చిలకలూరి...
డోకిపర్రు,ఎడ్లపాడు సెక్షన్ల సమస్యలకు తక్షణ పరిష్కారం..
చిలకలూరిపేట: విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక, విజయవాడ ఆధ్వర్యంలో చిలకలూరిపేట డివిజన్ పరిధిలోని 9 సెక్షన్ల వినియోగదారులకు న్యాయ సదస్సు ఏర్పాటు చేశారు. దీని ద్వారా విద్యుత్ అంతరాయాలు, హెచ్చు-తగ్గులు, మీటర్ సమస్యలు, బిల్లింగ్ వంటి అన్ని సమస్యలకు తక్షణ పరిష్కారం కల్పిస్తామని డివిజన్ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై. ఏడుకొండలు తెలిపారు.మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో సత్తెనపల్లి రోడ్డులోని పేరేచర్ల సెంటర్ వద్ద సాయి కృష్ణ కళ్యాణ మండపంలో ఈ సదస్సుజరుగుతుంది. ఫిబ్రవరి 21, శనివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంటుంది.అధ్యక్షుడిగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తి వై. విక్టర్ ఇమ్మానియెల్, సాంకేతిక సభ్యుడు డి. కృష్ణ నాయక్ (బీటెక్, ఎంబీఏ), ఆర్థిక సభ్యుడు కె. కృష్ణ (బీకామ్), స్వతంత్ర సభ్యురాలు ఏ. సునీత (ఎంఏ, ఎల్‌ఎల్‌బీ), CRDA సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ ఎం. శ్రీనివాస్ రావు (ఎంటెక్) పాల్గొంటారు.డోకిపర్రు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, చిలకలూరిపేట టౌన్-1, టౌన్-2, రూరల్, గణపవరం, ఎడ్లపాడు సెక్షన్ల వినియోగదారులు వ్రాతపూర్వకంగా సమస్యలు సమర్పించాలని, సత్వర పరిష్కారం జరుగుతుందని ఏడుకొండలు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంతాల ప్రజలు విద్యుత్ సమస్యలతో బాధపడుతున్న వారు పాల్గొని సమస్యలు తీర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
COMMENTS