పల్నాడు: జిల్లాలో పరిశ్రమలకు కేటాయించిన భూముల బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్డీవోలను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. ...
పల్నాడు: జిల్లాలో పరిశ్రమలకు కేటాయించిన భూముల బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్డీవోలను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు.
మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఏపీఐఐసీ భూముల కేటాయింపు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి పరిశ్రమలకు భూముల బదలాయింపు ప్రక్రియ కీలకమన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు జిల్లాలో రూ.5000 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలో మండల వారీగా క్లస్టర్లను అభివృద్ధి చేసేందుకు కామన్ ఫెసిలిటీ సెంటర్లను అభివృద్ధి చేయాలన్నారు. నూతన పరిశ్రమలను ప్రోత్సహిస్తూ జిల్లా స్థాయి , నియోజకవర్గ స్థాయి ర్యాంప్ (RAMP) కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంజనా సింహా, జిల్లా పరిశ్రమల అధికారి ఎస్వీ సురేష్, ఏపీ ఐసీసీ జెడ్ ఎం నరసింహారావు, ఎల్డీఎం రామ్ ప్రసాద్, డీసీసీబీ సీఈవో ఫణి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
COMMENTS