చిలకలూరిపేట: పట్టణంలోని 26వ వార్డులో నివాసం ఉంటున్న గుంజి సూరి నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశ కార్యక్రమం బుధవారం వైభవంగా జరిగి...
చిలకలూరిపేట: పట్టణంలోని 26వ వార్డులో నివాసం ఉంటున్న గుంజి సూరి నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశ కార్యక్రమం బుధవారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సామాజిక కార్యకర్త, ప్రధాత, నియోజకవర్గం యువ నాయకులు మండలనేని చరణ్ తేజ విచ్చేశారు.
నూతన గృహంలో అడుగుపెట్టిన సూరి కుటుంబ సభ్యులకు చరణ్ తేజ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడి సొంతింటి కలను నిజం చేసుకోవడం అభినందనీయమని, ఆ కొత్త ఇంట్లో ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట జనసేన పార్టీ ఇంచార్జి తోట రాజా రమేష్, పట్టణ అధ్యక్షులు మునిర్ హాసన్ వార్డు ప్రముఖులు, బంధుమిత్రులు మరియు స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.
COMMENTS