సూళ్లూరుపేట:దొరవారిసత్రం మండల పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా (ఎస్సై) జి.వి. చౌదరిని నియమిస్తూ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్...
సూళ్లూరుపేట:దొరవారిసత్రం మండల పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా (ఎస్సై) జి.వి. చౌదరిని నియమిస్తూ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం జిల్లాలో జరిగిన పోలీసు బదిలీల్లో భాగంగా ఈ మేరకు ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు
గతంలో పర్చూరు ఎస్సైగా విధులు నిర్వహించిన జి.వి. చౌదరి, అక్కడి నుంచి బదిలీపై తిరుపతి జిల్లాకు వచ్చారు. అప్పటి నుండి ఆయన జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని వెయిటింగ్ రూమ్ (VR)లో ఉన్నారు. తాజా బదిలీల నేపథ్యంలో ఆయనను సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని దొరవారిసత్రం ఎస్సైగా బాధ్యతలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు.
COMMENTS