లాపరోస్కోపిక్ ద్వారా 'ట్యూబల్ రీకెనలైజేషన్' విజయం.. చిలకలూరిపేట:స్థానిక లీలావతి హాస్పిటల్స్‌లో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్ట...
లాపరోస్కోపిక్ ద్వారా 'ట్యూబల్ రీకెనలైజేషన్' విజయం..
చిలకలూరిపేట:స్థానిక లీలావతి హాస్పిటల్స్‌లో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో ఒక అరుదైన మరియు సంక్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతమైంది. గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (ట్యూబెక్టమీ) చేయించుకున్న ఒక మహిళకు, తిరిగి సంతానం కోసం లాపరోస్కోపిక్ ట్యూబల్ రీకెనలైజేషన్ ప్రక్రియను వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది.
సాధారణంగా ఈ ప్రక్రియ ఎంతో క్లిష్టమైనదైనప్పటికీ, అత్యాధునిక లాపరోస్కోపిక్ పరిజ్ఞానంతో ఎటువంటి పెద్ద కోతలు లేకుండా, అత్యంత ఖచ్చితత్వంతో దీనిని పూర్తి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సుష్మ మాట్లాడుతూ.. ఆధునిక వైద్య సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల నిస్సంతాన సమస్యతో బాధపడే వారికి, ముఖ్యంగా గతంలో ఆపరేషన్ చేయించుకుని మళ్లీ పిల్లలు కావాలనుకునే వారికి ఈ చికిత్స ఒక వరమని పేర్కొన్నారు. పట్టణ ప్రజలకు ఇటువంటి అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.
COMMENTS