చిలకలూరిపేట: ఫిబ్రవరి 15న జరగనున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటప్పకొండ క్షేత్రానికి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థ...
చిలకలూరిపేట: ఫిబ్రవరి 15న జరగనున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటప్పకొండ క్షేత్రానికి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం చిలకలూరిపేట టౌన్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అర్బన్ సీఐ రమేష్ మాట్లాడుతూ ఈ ఏడాది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈసారి కొత్తగా ఎన్ఎస్-16 హైవే బైపాస్ మార్గం ద్వారా కోటప్పకొండకు వెళ్లేందుకు భక్తులకు అవకాశం కల్పించామని ఆయన వెల్లడించారు.భక్తుల రవాణా సౌకర్యం కోసం పురుషోత్తమపట్నం ఎక్స్ రోడ్డు వద్ద ప్రత్యేక బస్సులను ఆర్టీసీ వారు ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. అక్కడి నుండి సుమారు 100 ఆర్టీసీ బస్సులు, భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అలాగే, భారీగా తరలివచ్చే జనసమూహాన్ని ఆసరాగా చేసుకుని జేబుదొంగలు కొంతమంది ఉంటారు వారి జాగ్రత్త కొరకు పోలీసు వారిని మఫ్టీలో పెట్టడం జరిగిందని ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు.
COMMENTS