చిలకలూరిపేటలో నకిలీ సిగరెట్లుదందా.............ఊపిరితిత్తులు గుల్ల... ఖజానాకు కన్నం...... చిలకలూరిపేటలో నకిలీ సిగరెట్లుదందా.............ఊపిరితిత్తులు గుల్ల... ఖజానాకు కన్నం...... | AP News Line

చిలకలూరిపేటలో నకిలీ సిగరెట్లుదందా.............ఊపిరితిత్తులు గుల్ల... ఖజానాకు కన్నం......

చిలకలూరిపేట: సరదా సరదా సిగరెట్టు.. ఇది తాగకపోతే నాపై ఒట్టు...అనే పాత సినిమా పాట ఒకప్పుడు ధూమపాన ప్రియులకు కాలక్షేపంగా ఉండేది. కా...

చిలకలూరిపేట: సరదా సరదా సిగరెట్టు.. ఇది తాగకపోతే నాపై ఒట్టు...అనే పాత సినిమా పాట ఒకప్పుడు ధూమపాన ప్రియులకు కాలక్షేపంగా ఉండేది. కానీ నేడు అదే సిగరెట్టు ప్రాణసంకటంగా మారుతోంది. చిలకలూరిపేట కేంద్రంగా సాగుతున్న నకిలీ సిగరెట్ల వ్యాపారం సామాన్యుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోంది. ఏది అసలో, ఏది నకిలీయో తెలియక పొగ తాగుతున్న వారు ఆసుపత్రుల పాలవుతుండటం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

నకిలీలకు నిలయంగా పేట???

గతంలో ప్రకాశం జిల్లా మరియు స్థానిక అధికారులు సమన్వయంతో దాడులు నిర్వహించి, చిలకలూరిపేటలో రెండు లారీల నకిలీ సిగరెట్లను పట్టుకున్న ఉదంతం మరువక ముందే, మళ్లీ ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. ముఖ్యంగా 'పారిస్' బ్రాండ్ సిగరెట్లు ప్రభుత్వానికి జీఎస్టీ (GST) చెల్లించకుండానే ప్రతి చిన్న బడ్డీ కొట్టులోనూ దర్శనమివ్వడం గమనార్హం.

సిండికేట్‌గా మారి దందా....

పట్టణంలో నలుగురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి, రహస్య గోడౌన్లలో నకిలీ నిల్వలను ఉంచుతూ అధిక లాభాల కోసం అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేవలం పారిస్ మాత్రమే కాకుండా, మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న విల్స్ ఫ్లేక్,ఫిల్టర్,గోల్డ్ ఫ్లేక్ కింగ్స్ (లైట్ & స్ట్రాంగ్)వంటి ప్రముఖ బ్రాండ్ల ప్యాకింగ్‌ను అచ్చం ఒరిజినల్‌లాగే ముద్రించి నకిలీలను విక్రయిస్తున్నారు. వీటిని తాగడం వల్ల తీవ్రమైన దగ్గు, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయని బాధితులు వాపోతున్నారు.

అండర్ సెల్లింగ్.. అదనపు బాదుడు...

బడ్జెట్ సమయంలో ధరలు పెరుగుతాయనే ముందస్తు అంచనాతో, ఐటీసీ (ITC) వంటి కంపెనీల నుండి భారీగా స్టాక్ కొనుగోలు చేసిన డీలర్లు, వాటిని బయటకు తీయకుండా 'అండర్ సెల్' చేస్తున్నారు. పెరిగిన ధరలకు, పాత ధరలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు???

గతంలో భారీగా పట్టుబడిన రికార్డులు ఉన్నా, ప్రస్తుతానికి తనిఖీలు నిలిచిపోవడంతో ఈ మాఫియా రెచ్చిపోతోంది. సంబంధిత  అధికారులు ఉన్నారా...లేరా  అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, చిలకలూరిపేటలోని గోడౌన్లపై దాడులు నిర్వహించి నకిలీ సిగరెట్ల అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

COMMENTS

పేరు

Andhra Pradesh,18,CPT News,18,Guntur,2,health articles,86,Local News,18,national,8,Palanadu news,4,Palnadu News,4,pawan kalyan,1,Political,3,Telangana,1,
ltr
item
AP News Line: చిలకలూరిపేటలో నకిలీ సిగరెట్లుదందా.............ఊపిరితిత్తులు గుల్ల... ఖజానాకు కన్నం......
చిలకలూరిపేటలో నకిలీ సిగరెట్లుదందా.............ఊపిరితిత్తులు గుల్ల... ఖజానాకు కన్నం......
https://blogger.googleusercontent.com/img/a/AVvXsEg579qqCrgIkeDr-ihnF-tpJenp4OkbizW6Z4R7N6qJg4m3cbG_jjEPF5Aui4Qw1oMRjy3t862KuEP2jNl7_yFVSacWRt9_7wAUwXs4FrK5XpZeLzP5h7n7AMapxA3joQm3XW7Lu8-BUBnHnRD_oMTdVnpQPRrtUPv5VVf9C59K3a9ej9wY4QTCAdNBzOI
https://blogger.googleusercontent.com/img/a/AVvXsEg579qqCrgIkeDr-ihnF-tpJenp4OkbizW6Z4R7N6qJg4m3cbG_jjEPF5Aui4Qw1oMRjy3t862KuEP2jNl7_yFVSacWRt9_7wAUwXs4FrK5XpZeLzP5h7n7AMapxA3joQm3XW7Lu8-BUBnHnRD_oMTdVnpQPRrtUPv5VVf9C59K3a9ej9wY4QTCAdNBzOI=s72-c
AP News Line
https://www.apnewsline.com/2026/02/blog-post_122.html
https://www.apnewsline.com/
https://www.apnewsline.com/
https://www.apnewsline.com/2026/02/blog-post_122.html
true
8209592157698815989
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy