ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు ప్రిన్సిపల్ జిల్లా కోర్టులను ఆ జిల్లా కేంద్రాల్లోనే ఏర్పాటు చేయాలని శాసన మం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు ప్రిన్సిపల్ జిల్లా కోర్టులను ఆ జిల్లా కేంద్రాల్లోనే ఏర్పాటు చేయాలని శాసన మండలి సభ్యుడు మర్రి రాజశేఖర్ డిమాండ్ చేశారు.శాసన మండలిలో జిల్లా కోర్టుల వ్యవస్థపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన, ప్రస్తుతం 28 జిల్లాలు ఏర్పాటైనప్పటికీ కొన్ని జిల్లాల్లో ప్రిన్సిపల్ జిల్లా కోర్టులు పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనే కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా ఉదాహరణగా పేర్కొన్నారు."పల్నాడు జిల్లా పరిధిలో నరసరావుపేటలో జిల్లా కోర్టు పనిచేస్తున్నప్పటికీ, ప్రిన్సిపల్ కోర్టు గుంటూరులోనే ఉంది. దీనితో న్యాయవాదులు, ప్రజలు మొదట గుంటూరుకు వెళ్లి కేసులు ఫైల్ చేసి, తర్వాత నరసారావుపేటకు ట్రాన్స్‌ఫర్ చేయించుకోవలసి వస్తోంది. ఇది సమయం, ఖర్చు, శ్రమలతో ఇబ్బందులు కలిగిస్తోంది" అని ఆయన తెలిపారు.కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న కోర్టులను ప్రిన్సిపల్ జిల్లా కోర్టులుగా ప్రకటించేందుకు హైకోర్టుకు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని మర్రి రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్‌ను కోరారు.
COMMENTS