ప్రముఖ శైవ క్షేత్రంగా పేరు గాంచిన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని పద్మశ్రీ అవార్డు గ్రహీత, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఆదివ...
ప్రముఖ శైవ క్షేత్రంగా పేరు గాంచిన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని పద్మశ్రీ అవార్డు గ్రహీత, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు.స్వామివారి సన్నిధికి చేరుకున్న ఆయనకు బీసీ వెల్ఫేర్ శాసనసభ కమిటీ సభ్యులు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆలయ ప్రాంగణంలో ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా త్రికోటేశ్వర స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలు, పూజాకార్యక్రమాల్లో రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొని దైవ ఆశీస్సులు పొందారు.మహాశివరాత్రి తిరుగుణాల సందర్భంగా కోటప్పకొండలో చేపట్టిన విస్తృత ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే అరవింద్ బాబు రాజేంద్రప్రసాద్‌కు వివరించారు.ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని సుమారు 20 నుంచి 25 లక్షల మంది భక్తులు ఇక్కడికి హోం అవకాశం ఉందని తెలిపారు.
COMMENTS