పల్నాడు జిల్లాలో గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ కృతిక శుక్లా కొత్తగా 'స్వర్ణ గ...
పల్నాడు జిల్లాలో గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ కృతిక శుక్లా కొత్తగా 'స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని'కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో వి హేమలతదేవి మాట్లాడుతూ ప్రతి నెల మొదటి గురువారం ప్రతి పంచాయతీలో జరిగే ఈ కార్యక్రమంయడ్లపాడు మండలంలోని 18 పంచాయతీల్లో విజయవంతంగా నిర్వహించబడింది అని పంచాయతీరాజ్,వైద్య ఆరోగ్య, విద్య, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు,ఉద్యోగులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు తమ కార్యక్రమాలు,ఆరోగ్య సలహాలు వివరించాయి అని అన్నారు.గర్భిణీలు, బాలురు, పసి పిల్లలకు అందే ఆహారం, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం కింద మొదటి కాన్పుకు రూ.5 వేలు, రెండో కాన్పులో ఆడబిడ్డ అయితే రూ.6 వేలు నగదు సహాయం వంటి వివరాలు చర్చించారు.హై రిస్క్ గర్భిణీల జాగ్రత్తలు, టీనేజ్ గర్భధారణ నష్టాలు, 16 సంవత్సరాల వరకు 11 రకాల టీకాలు,మలేరియా-డెంగ్యూ నివారణ, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు జీవనశైలిమార్పులు, క్యాన్సర్ స్క్రీనింగ్, త్రాగునీరు-పరిసరాల పరిశుభ్రత, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వంటివి తెలిపారు.కార్యక్రమంలో గ్రామ ప్రజల సూచనలు సేకరించారు.వచ్చే నెల మొదటి గురువారం (మార్చి 5) మళ్లీ ఈ మీటింగ్ జరుగుతుందని తెలిపారు.
పంచాయతీరాజ్,వైద్యశాఖ,విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ,డిఆర్డిఓ మొదలైన అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రతి గ్రామాన్ని ఆరోగ్యకరంగా తీర్చిదిద్దాలి. ప్రజలంతా సహకరించాలి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పి. మధుసూదనరావు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఏ.తులసి, జె. రాజా,ఏఎన్ఎం ఆషా, సర్పంచి కె. బాబు, గ్రామ నాయకులు ఏ. వరప్రసాద్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
COMMENTS