లీలావతి హాస్పిటల్స్ కీలక చొరవ... చిలకలూరిపేట: మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, గర్భాశయ క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టే ...
లీలావతి హాస్పిటల్స్ కీలక చొరవ...
చిలకలూరిపేట: మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, గర్భాశయ క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టే లక్ష్యంతో చిలకలూరిపేటలోని లీలావతి హాస్పిటల్స్ కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రముఖ వైద్యురాలు డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో గర్భాశయ క్యాన్సర్ నివారణ మరియు HPV (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ లావు సుష్మ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా మహిళలను వేధిస్తున్న గర్భాశయ క్యాన్సర్‌ను సరైన సమయంలో టీకా తీసుకోవడం ద్వారా వందకు వంద శాతం నివారించవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా, అత్యాధునికమైన గార్డసిల్-9 (Gardasil-9) టీకా అందుబాటులోకి వచ్చిందని, ఇది క్యాన్సర్‌కు కారణమయ్యే వివిధ రకాల వైరస్ వేరియంట్ల నుండి రక్షణ కల్పిస్తుందని వివరించారు. 9 నుండి 14 ఏళ్ల వయస్సు గల బాలికలు ఈ టీకా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు తప్పుతుందని, అలాగే పెద్దలు కూడా వైద్యుల సలహాతో దీనిని పొందవచ్చని ఆమె సూచించారు.మహిళల ప్రాణాలు కాపాడేందుకు గార్డసిల్-9 వ్యాక్సిన్ ఒక వరమని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ వర్గాలు కోరాయి.
COMMENTS