ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో NH-16 జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవిం...
ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో NH-16 జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన లారీ (రిజ్: TN-52-H-9681) డ్రైవర్ అతి వేగంగా,నిర్లక్ష్యంగా నడుపుతూ రహదారి డివైడర్‌లో మొక్కలకు నీరు పోస్తున్న వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో లారీలో ప్రయాణిస్తున్న నాగమ్మ అనే మహిళా కూలీ తీవ్ర గాయాలతో సంఘటన స్థలంలోనే మృతి చెందింది. ప్రమాద ప్రభావంతో లారీ కేబిన్ తీవ్రంగా దెబ్బతిని, వాహనం రహదారి పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ కేబిన్‌లో చిక్కుకుపోయాడు.సమాచారం అందిన వెంటనే ఎడ్లపాడు ఎస్ఐ టి శివరామకృష్ణ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని, స్థానికుల సహకారంతో డ్రైవర్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
COMMENTS