చిలకలూరిపేట:ఏపీఎస్‌ఆర్టీసీ డిపో నూతన మేనేజర్‌గా యద్దనపూడి వేణుబాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన...
చిలకలూరిపేట:ఏపీఎస్‌ఆర్టీసీ డిపో నూతన మేనేజర్‌గా యద్దనపూడి వేణుబాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన మేనేజర్ బదిలీ కావడంతో, భీమవరం నుండి బదిలీపై వచ్చిన వేణుబాబు ఆ బాధ్యతలను చేపట్టారు.బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కూడా తాను చిలకలూరిపేట డిపోలో పనిచేసిన అనుభవం ఉందని గుర్తుచేసుకున్నారు. స్థానిక ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించడమే తన ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా త్వరలో జరగనున్న కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తులకు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా డిపో సిబ్బంది మరియు కార్మిక సంఘాల నేతలు వేణుబాబుకు ఘనంగా స్వాగతం పలికి, పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలియజేశారు.
COMMENTS