చిలకలూరిపేట:పట్టణ అభివృద్ధిలో భాగంగా మున్సిపల్ యంత్రాంగం పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహ...
చిలకలూరిపేట:పట్టణ అభివృద్ధిలో భాగంగా మున్సిపల్ యంత్రాంగం పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో భారీగా పన్నులు వసూలయ్యాయి.
లక్ష్యం దిశగా రెవెన్యూ విభాగం..
రెవెన్యూ ఆఫీసర్ సుబ్బారావు పర్యవేక్షణలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు షేక్ అబ్దుల్ ఖాదర్, గిరి తమ బృందాలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. వార్డ్ అడ్మిన్‌ల సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆస్తి పన్ను మరియు నీటి పన్ను రూపంలో నేడు రూ. 5 లక్షల వరకు వసూలైనట్లు అధికారులు వెల్లడించారు.
బకాయిదారులు సహకరించాలి..
ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు మాట్లాడుతూ, పట్టణంలోని మౌలిక సదుపాయాల కల్పన మరియు అభివృద్ధి పనులకు పన్నులే ప్రధాన వనరులని పేర్కొన్నారు. పన్ను బకాయి ఉన్న వారు జాప్యం చేయకుండా త్వరితగతిన చెల్లించి, పట్టణాభివృద్ధికి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
COMMENTS