పల్నాడు: ఫిబ్రవరి 5న పల్నాడు జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృ...
పల్నాడు: ఫిబ్రవరి 5న పల్నాడు జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు.ఉదయం 9 గం.ల నుంచి మధ్యాహ్నం 12 గం.ల వరకూ కనీసం 200 మందితో గ్రామ సభలు నిర్వహించి గ్రామంలోని ఆరోగ్య సమస్యలను క్రోడీకరించాలన్నారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
షుగరు, బీపీ వంటి జీవన శైలి జబ్బులు, బాలలు,విద్యార్థుల్లో పోషకాహార లోపాలు గుర్తించి నమోదు చేయాలన్నారు. ఫిబ్రవరి 4వ తేదీన పంచాయతీ సెక్రటరీలు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, ఏఎన్ఎం లు, అంగన్వాడీ సిబ్బంది, డ్వాక్రా మహిళలతో సమావేశం నిర్వహించుకుని స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పిడి ఝాన్సీ రాణి, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, డీఎంహెచ్ఓ రవి, డీఈవో, మండల స్పెషల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS