చిలకలూరిపేట పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో లీలావతి హాస్...
చిలకలూరిపేట పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ పరికరాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. గర్భిణీ స్త్రీలకు మరియు ఇతర రోగులకు ఖచ్చితమైన రోగ నిర్ధారణ కోసం ఈ సేవలు ఎంతో దోహదపడతాయని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి.
గర్భస్థ శిశువు ఆరోగ్యంపై స్పష్టమైన అవగాహన..
సాధారణ స్కాన్‌ల కంటే 4D స్కాన్ ఎంతో ప్రభావవంతమైనది. దీని ద్వారా గర్భంలోని శిశువు కదలికలను, ముఖ కవళికలను రియల్ టైమ్ వీడియో రూపంలో చూడవచ్చు. శిశువు ఎదుగుదల, గుండె పనితీరు మరియు ఏదైనా శారీరక లోపాలు ఉంటే ముందుగానే గుర్తించి తగిన చికిత్స అందించడానికి ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని డాక్టర్ లావు సుష్మ తెలిపారు.
అత్యాధునిక సాంకేతికతతో....
ఖచ్చితమైన రిపోర్ట్స్
లీలావతి హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన ఈ నూతన మిషన్ ద్వారా అత్యంత స్పష్టమైన చిత్రాలను పొందవచ్చు. కేవలం గర్భిణీలకు మాత్రమే కాకుండా, పొత్తికడుపు సమస్యలు, గర్భాశయ సంబంధిత వ్యాధుల నిర్ధారణకు కూడా ఈ 4D స్కానింగ్ కీలకంగా మారుతుంది. స్థానికంగానే ఈ సదుపాయం ఉండటం వల్ల రోగులు ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అందుబాటులో నిపుణులైన వైద్యులు....
డాక్టర్ లావు సుష్మ పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన రేడియాలజిస్టులు ఈ స్కానింగ్ ప్రక్రియను నిర్వహిస్తారు. నాణ్యమైన వైద్యం, సరసమైన ధరలకే అందించడమే లీలావతి హాస్పిటల్స్ ప్రాధాన్యత అని యాజమాన్యం వెల్లడించింది.
COMMENTS