గతేడాది సిలబస్, నిబంధనలే ఈసారీ అమలు.... పాఠశాల విద్యాశాఖ కసరత్తు పూర్తి.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మరో డీఎస్సీ ప్రకటి...
గతేడాది సిలబస్, నిబంధనలే ఈసారీ అమలు....
పాఠశాల విద్యాశాఖ కసరత్తు పూర్తి....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మరో డీఎస్సీ ప్రకటించేందుకు సిద్ధమైంది. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఇటీవల విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఉగాది పండగ సందర్భంగా ఉపాధ్యాయ నియామకాలకు ప్రకటన విడుదల చేయాలని భావిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరించింది.అన్ని రకాల పోస్టులూ కలిపి 3,600 వరకు ఉండొచ్చు. ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్లు, సంక్షేమ శాఖలకు చెందిన పాఠశాలల నుంచి ప్రాథమికంగా వివరాలు తీసుకున్నారు.
COMMENTS