ఆర్థిక లోటు రూ. 75,868 కోట్లు.... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,32,205 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది...
ఆర్థిక లోటు రూ. 75,868 కోట్లు....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,32,205 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. దీనిలో ఆర్థిక లోటు రూ. 75,868.09 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 22,002.50 కోట్లుగా అంచనా. మూలధన వ్యయానికి రూ. 53,915 కోట్లు కేటాయింపు చేశారు. కేంద్ర పన్నుల వాటాగా రూ. 64,362 కోట్లు, పన్నుయేతర ఆదాయం రూ. 11,473 కోట్లు, పన్ను ఆదాయం రూ. 1,25,845 కోట్లునుఆశించారు.గత ప్రభుత్వం మిగిల్చిన రుణం రూ. 9.74 లక్షల కోట్లుగా తెలిపారు. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు రూ. 30 వేల కోట్లు, హార్టికల్చర్ క్లస్టర్ల ఏర్పాటుకు రూ. 30 వేల కోట్లు కేటాయించారు.
*ఆర్థిక ప్రాంతాల ఏర్పాటు..*
అమరావతి ఆర్థిక ప్రాంతంలో 9 జిల్లాలు చేర్చారు. విశాఖ ఆర్థిక ప్రాంత పరిధిలో 10 జిల్లాలు, దీనికి రూ. 28 వేల కోట్లు కేటాయింపు. ఏపీలో ఆర్థిక జోన్ల ఏర్పాటు ప్రధాన ఆకర్షణ.
*కీలక శాఖలకు కేటాయింపులు...*
పర్యావరణం, అటవీ, విజ్ఞాన శాస్త్ర శాఖలకు రూ. 714 కోట్లు.
పట్టాణాభివృద్ధి శాఖకు రూ. 14,539 కోట్లు.
వీబిజ్ రామ్ జీ పథకానికి రూ. 8,365 కోట్లు.
ఎన్టీఆర్ వైద్యసేవలకు రూ. 4 వేల కోట్లు.
హౌసింగ్‌కు రూ. 5,451 కోట్లు.
జల జీవన్ మిషన్‌కు రూ. 4 వేల కోట్లు.
ఎన్టీఆర్ భరోసా (పెన్షన్లు)కు రూ. 27,719 కోట్లు.
దీపం పథకానికి రూ. 260 కోట్లు.
ఈ బడ్జెట్‌లో ప్రజల సంక్షేమం,అభివృద్ధి ప్రాధాన్యతగా పెట్టారు.
COMMENTS