పాల్గొన్న మాజీ మంత్రి, ప్రత్తిపాటి, జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల. చిలకలూరిపేట పట్టణంలో కొండవీడు ఉత్సవాల సందడి మొదలైం...
పాల్గొన్న మాజీ మంత్రి, ప్రత్తిపాటి, జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల.
చిలకలూరిపేట పట్టణంలో కొండవీడు ఉత్సవాల సందడి మొదలైంది.చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఈ ఉత్సవాల గురువారం ఉదయం చిలకలూరిపేట పట్టణంలో 'కొండవీడు-2కే రన్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, పలువురు అధికారులుపాల్గొని, విద్యార్థులు, యువజనులను ఉత్సాహపరిచారు. స్థానిక రైతుబజార్ నుంచి పట్టణంలోని పలుకూడాలని కలుపుకొని ఎన్ ఆర్ టి సెంటర్ వరకు సాగిన ఈ 2 కిలోమీటర్ల పరుగు లో భారీ సంఖ్యలో విద్యార్థులు,స్థానికులు పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం ఉత్సాహాన్ని తగ్గకుండా సాగింది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, "కొండవీడు చరిత్రలో మన ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉంది.ఈ ఉత్సవాల ద్వారా ఆ వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాలని, ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని" పిలుపునిచ్చారు.కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ, "ఇలాంటి కార్యక్రమాలు ఆరోగ్యం, ఉత్సాహాన్నిపెంచుతాయి.కొండవీడు ఉత్సవాలు మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకునేలా అందరినీ ఉత్సాహపరుస్తాయిఅని తెలిపారు.కొండవీడు ఉత్సవాల సంఘటకులు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అందరి సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఉత్సవాల్లో మరిన్ని కార్యక్రమాలు రానున్నాయి. స్థానికులు, విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు విద్యార్థిని విద్యార్థులు వివిధ హోదాల నాయకులు పాల్గొన్నారు.
COMMENTS