పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లి... చిలకలూరిపేట: పట్టణంలోని ప్రముఖ వైద్యశాల లీలావతి హాస్పిటల్స్‌లో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్...
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లి...
చిలకలూరిపేట: పట్టణంలోని ప్రముఖ వైద్యశాల లీలావతి హాస్పిటల్స్‌లో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో ఒక విజయవంతమైన శస్త్రచికిత్స జరిగింది. గతంలో సిజేరియన్ అయిన గర్భిణీకి, వైద్యులు అత్యంత నైపుణ్యంతో రిపీట్ ఎలక్టివ్ LSCS (Repeat Elective LSCS) విధానం ద్వారా ప్రసవం నిర్వహించారు.ఈ శస్త్రచికిత్స ద్వారా సదరు మహిళ 2.7 కిలోల బరువున్న ఆరోగ్యకరమైన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్ లావు సుష్మ తెలిపారు. మెరుగైన వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్య బృందం సమక్షంలో ఈ ప్రసవం ప్రశాంతంగా ముగియడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
COMMENTS