చిలకలూరిపేటలోని అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల యువతుల కోసం ఉచిత శిక్షణా కార్యక్రమాలు ప్రారంభి...
చిలకలూరిపేటలోని అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల యువతుల కోసం ఉచిత శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఈ శిక్షణలో General Duty Assistant (నర్సింగ్) కోర్సు మరియు కంప్యూటర్ కోర్సులతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ కూడానేర్పబడుతుంది.నాలుగు నెలలపాటు కొనసాగే ఈ కోర్సులు రెసిడెన్షియల్ మరియు నాన్ రెసిడెన్షియల్ విధానంలో అందుబాటులో ఉంటాయి.శిక్షణ పూర్తయిన తర్వాత అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడనున్నాయని నిర్వాహకులు తెలిపారు.అర్హత మరియు ఆసక్తి ఉన్న యువతులు తమ 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్, ఆధార్, రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీలు మరియు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు తీసుకువచ్చి చిలకలూరిపేట పట్టణములోని అడ్డరోడ్డు వద్ద గల అసిస్ట్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. మరిన్ని వివరాల కోసం 9182634233, 8978820317 నంబర్లను సంప్రదించవచ్చు.
COMMENTS