అతి తక్కువ కోతతో ఓపెన్ టు బెక్టమీ. చిలకలూరిపేట: పట్టణంలోని ప్రముఖ వైద్యశాల లీలావతి హాస్పిటల్స్ లో కుటుంబ నియంత్రణ దిశగా మహిళలకు ...
అతి తక్కువ కోతతో ఓపెన్ టు బెక్టమీ.
చిలకలూరిపేట: పట్టణంలోని ప్రముఖ వైద్యశాల లీలావతి హాస్పిటల్స్ లో కుటుంబ నియంత్రణ దిశగా మహిళలకు శాశ్వత పరిష్కారాన్ని అందించే ట్యూబెక్టమీ (Tubectomy) శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు సుష్మ పర్యవేక్షణలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
*ఏమిటీ ట్యూబెక్టమీ...*
ట్యూబెక్టమీ అనేది మహిళల్లో సంతాన నిరోధకత కోసం చేపట్టే ఒక శాశ్వత స్టెరిలైజేషన్ విధానం.పిల్లలు చాలని భావించే దంపతులకు ఇది అత్యంత సురక్షితమైన మరియు నమ్మదగిన పద్ధతి.
*లీలావతి హాస్పిటల్స్ ప్రత్యేకతలు...*
అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో సుశిక్షితులైన బృందం ఈ శస్త్రచికిత్సలను నిర్వహిస్తుంది.తక్కువ సమయంలో, అతి తక్కువ కోతతో ఓపెన్ టు బెక్టమీ ఆపరేషన్ నిర్వహించడం వల్ల కోలుకోవడం సులభం అవుతుంది.ఆపరేషన్ థియేటర్‌లో ఇన్ఫెక్షన్లు సోకకుండా అత్యున్నత స్థాయి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. శస్త్రచికిత్స తర్వాత రోగి త్వరగా కోలుకోవడానికి అవసరమైన పూర్తి స్థాయి వైద్య సదుపాయాలు ఇక్కడ కలవు.
ఈ సందర్భంగా డాక్టర్ లావు సుష్మ మాట్లాడుతూ.. "కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన పెంచుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ట్యూబెక్టమీ అనేది చాలా సురక్షితమైన ప్రక్రియ, దీనిపై ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు" అని పేర్కొన్నారు.
COMMENTS