చిలకలూరిపేట: రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో రహదారి భద్రతా శాఖ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలోని ఎన్‌పీటీఆర్‌కేఎం పాఠశాల...
చిలకలూరిపేట: రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో రహదారి భద్రతా శాఖ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలోని ఎన్‌పీటీఆర్‌కేఎం పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్. గోపాల్ మోటార్ వాహన శిక్షణాధికారి మాట్లాడుతూ విద్యార్థులకు రోడ్డు భద్రత అంశాలపై విస్తృతంగా వివరించారు. ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ ధరించాల్సిన అవసరం, వేగ పరిమితులు, ట్రాఫిక్ సంకేతాల ప్రాముఖ్యత, రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.రోడ్డు ప్రమాదాలను ఎలా నివారించుకోవాలో సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.విద్యార్థులు చిన్న వయసు నుంచే ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు.అనంతరం విద్యార్థులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.
COMMENTS