డిప్యూటీ డీఎండీవోలను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.. నరసరావుపేట: గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణ మెరుగు పరిచేందుకు క...
డిప్యూటీ డీఎండీవోలను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా..
నరసరావుపేట: గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణ మెరుగు పరిచేందుకు కృషి చేయాలని నూతనంగా నియమితులైన డిప్యూటీ డీఎండీవోలను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో డిప్యూటీ డీఎండీవోలతో సమావేశం నిర్వహించారు. తొలిసారి జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా పేద విద్యార్థులకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కోసం అవసరమయ్యే స్టడీ మెటీరియల్ ను డిప్యూటీ డీఎండీఓలు అందజేశారు.
సమీకృత కుటుంబ సర్వే, ఈకేవైసీ, వాట్సప్ గవర్నెన్స్ వంటి సర్వేలు ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది చేపడుతున్నారన్నారు. మండల స్థాయి, మున్సిపాలిటీల స్థాయిల్లో సర్వేలు, ప్రభుత్వ పథకాల అమలుపై డిప్యూటీ డీఎండీవోల పర్యవేక్షణ ఉంటుందన్నారు.
నేరుగా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ సేవలు అందించే వాట్సప్ గవర్నెన్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి శుక్రవారం వాట్సాప్ గవర్నెన్స్ డ్రైవ్ నిర్వహించాలన్నారు.తమ పరిధిలో సిబ్బందిని పూర్తి స్థాయిలో వినియోగించుకునే స్వేచ్ఛ డిప్యూటీ డీఎండీవోలకు ఉంటుందన్నారు. డీఎల్డీవోలు వెంకట్ రెడ్డి, గబ్రు నాయక్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
COMMENTS