ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని వంకాయలపాడు గ్రామ శివారు ప్రాంతంలో అక్రమంగా జూదం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఎడ్లపాడు ఎస...
ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని వంకాయలపాడు గ్రామ శివారు ప్రాంతంలో అక్రమంగా జూదం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఎడ్లపాడు ఎస్ఐ టి శివరామకృష్ణ ఆధ్వర్యంలో దాడి నిర్వహించారు. దాడిలో జూదం ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.31,450 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఈ శివరామకృష్ణ మాట్లాడుతూ ఘటనకు సంబంధించి చట్టప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు.అక్రమ కార్యకలాపాలు, ముఖ్యంగా జూదం వంటి నేరాల్లో ఎవరూ పాల్గొనరాదని ప్రజలకు సూచించారు.అలాగే గ్రామాలలో ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం లభించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100 ద్వారా తెలియజేయాలని ప్రజలను కోరారు. పోలీసులు ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
COMMENTS