చిలకలూరిపేట: స్థానిక లీలావతి హాస్పిటల్స్‌లో ప్రముఖ వైద్యురాలు డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో ఒక మహిళా రోగికి విజయవంతంగా ప్రసవం జర...
చిలకలూరిపేట: స్థానిక లీలావతి హాస్పిటల్స్‌లో ప్రముఖ వైద్యురాలు డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో ఒక మహిళా రోగికి విజయవంతంగా ప్రసవం జరిగింది. ప్రథమ గర్భం దాల్చిన సదరు మహిళకు టర్మ్ గర్భధారణ (పూర్తి నెలలు నిండిన తర్వాత) సమయంలో పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రిలో చేరారు.సదరు అధిక ప్రమాదం ఉన్న గర్భిణీకి గతంలో మూర్ఛ వ్యాధి (Epilepsy) మరియు హైపోథైరాయిడిజం (Hypothyroidism) వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, డాక్టర్ సుష్మ తన బృందంతో కలిసి అత్యంత జాగ్రత్తగా వైద్య సేవలు అందించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆమె 2.8 కిలోల బరువున్న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. క్లిష్టమైన ఆరోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ, సురక్షితంగా ప్రసవం చేసినందుకు బాధితురాలి కుటుంబ సభ్యులు డాక్టర్ లావు సుష్మకు మరియు ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
COMMENTS