గ్రామీణ కూలీలకు 125 రోజుల ఉపాధి హామీ.. యడ్లపాడు: గ్రామీణ ఉపాధి హామీ పథకం మరింత బలోపేతం కానుందని జిల్లా ఉపాధి హామీ వి...
గ్రామీణ కూలీలకు 125 రోజుల ఉపాధి హామీ..
యడ్లపాడు: గ్రామీణ ఉపాధి హామీ పథకం మరింత బలోపేతం కానుందని జిల్లా ఉపాధి హామీ విభాగ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఈవూరి బూసిరెడ్డి తెలిపారు. సోమవారం యడ్లపాడు గ్రామ పంచాయతీలో నిర్వహించిన వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్)-వీబీ-జీ రామ్ జీ కార్యక్రమంలో ఆయనమాట్లాడుతూ, పాత పథకంలో సవరణలు చేసి ఆధునిక గ్రామీణ అవసరాలకు అనుగుణంగా ఈ పథకాన్ని రూపుదిద్దినట్లు వివరించారు.గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న కూలీలకు ఈ చట్టం ప్రకారం సంవత్సరానికి 125 రోజులు ఉపాధి హామీ లభిస్తుందని తెలిపారు. దీనివల్ల కూలీల ఆదాయం కనీసం 25 శాతం పెరుగుతుందన్నారు. ఈ అవకాశంతో కరువు ప్రాంతాల్లో ప్రజల వలసలు తగ్గి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కాబోతోందని పేర్కొన్నారు.ఈ పథకం నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి సారించిందని బూసిరెడ్డి తెలిపారు. అనంతరం ఎంపీడీవో వి. హేమలతదేవి మాట్లాడుతూ నీటి భద్రత, గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధి అభివృద్ధి, వాతావరణ మార్పుల ప్రభావ నిరోధం. చెరువులు, కుంటలు వంటి నీటి వనరుల అభివృద్ధి, పునరుద్ధరణ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు.దీని ద్వారా వ్యవసాయానికి అవసరమైన నీటి వసతిమెరుగుపడటంతో పాటు భూగర్భ జలాల నిల్వలు పెరుగుతాయని వివరించారు. పక్కా రోడ్లు, గ్రామాలఅనుసంధానం, అవసరమైన సేవల కల్పన ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఉద్ధరించవచ్చన్నారు.పథకం అమల్లో పారదర్శకతకు డిజిటల్ హాజరు, నేరుగా వేతనాల చెల్లింపు, డాటా ఆధారిత ప్రణాళిక, కృత్రిమ మేధ ఆధారిత పర్యవేక్షణ వ్యస్థలను అమలు చేస్తారని తెలిపారు. రాష్ట్రాలు పంటల వేసే, కోసే కాలాల్లో రైతులకు కూలీల కొరత తలెత్తకుండా 60 రోజులపాటు పనులను నిలిపివేసే అధికారాన్ని వినియోగించుకోవచ్చన్నారు. అవినీతినిఅరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త స్టీరింగ్ కమిటీ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు. గ్రామపంచాయతీల పర్యవేక్షణ అధికారాలు పెంచడంతోపాటు జీపీఎస్, మొబైల్ ఆధారిత మానిటరింగ్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.గ్రామీణ ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యడ్లపాడు సర్పంచ్ కారుచోళ హేమ, కార్యదర్శి ఎన్. బాపిరాజు, ఎంపీడీవో బి.హేమలతాదేవి,ఏపీవో డి.సుందరరావు, సచివాలయ సిబ్బంది, ఉపాధి శ్రామికులుతదితరులు పాల్గొన్నారు.
COMMENTS