ఎడ్లపాడు: నేషనల్ మిషన్ ఆన్ నాచురల్ ఫామింగ్ (NMNF) పథకంలో భాగంగా పల్నాడు జిల్లాలోని అన్ని మండలాల్లో మట్టి నమూనాల సేకరణ ప్రారంభమైం...
ఎడ్లపాడు: నేషనల్ మిషన్ ఆన్ నాచురల్ ఫామింగ్ (NMNF) పథకంలో భాగంగా పల్నాడు జిల్లాలోని అన్ని మండలాల్లో మట్టి నమూనాల సేకరణ ప్రారంభమైంది. జిల్లా వ్యవసాయ అధికారి ఎం. జగ్గారావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి,ఎడ్లపాడు మండలం చంగిస్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన రైతు ఫరూక్ పొలంలో నమూనాల సేకరణ విధానాన్ని పర్యవేక్షించారు.జిల్లాలో 20 వేల రైతుల పొలాల నుంచి మట్టి నమూనాలు సేకరించనున్నామని జగ్గారావుతెలిపారు. ఎడ్లపాడు మండలంలో 358 నమూనాలు తీసుకుంటామని, ప్రకృతి వ్యవసాయం కోసం గుర్తించిన పొలాల నుంచే ఇవి సేకరిస్తామని స్పష్టం చేశారు. గ్రామ వ్యవసాయ సహాయకులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సమన్వయంతో ఈ పని చేయాలని సూచించారు.జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ అమల కుమారి మాట్లాడుతూ, భూసార పరీక్ష ద్వారా భూమి ఆరోగ్యం, కార్బన్ శాతం మార్పులు తెలుస్తాయని, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయించుకోవాలని అభిప్రాయపడ్డారు.కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఏ. హరి ప్రసాద్, గ్రామ వ్యవసాయ సహాయకులు జ్యోష్ణ, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
COMMENTS