పల్నాడు జిల్లాలోని ప్రతి కుటుంబం జీవిత, ప్రమాద బీమా పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను...
పల్నాడు జిల్లాలోని ప్రతి కుటుంబం జీవిత, ప్రమాద బీమా పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన పథకాల పరిధిలోని లేని పేదలను గుర్తించే ప్రక్రియ చేపట్టి వారం రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది క్షేత్ర స్థాయిలో సర్వే చేసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో అభ్యుదయం కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సమీక్ష సమావేశం నిర్వహించారు.
మండలానికి ఒక క్లస్టర్ విధానంలో ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యాపార అవకాశాలను ప్రోత్సహిస్తూ బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయాలన్నారు.
వెల్దుర్తి, నకరికల్లు మండలాల్లో ఆర్వోఎఫ్ఫార్ పట్టాలున్న చెంచు రైతులకు పంట రుణాలు మంజూరు చేసే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
జిల్లాలో నియోజకవర్గానికి ఒక మోడల్ సోలార్ గ్రామాన్ని తయారు చేయాలన్నారు. మోడల్ సోలార్ గ్రామాల కోసం వెండర్ల ఎంపిక చేయడం జరిగిందన్నారు. విద్యుత్ సరఫరా ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో సూర్య ఘర్ పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించి, మోడల్ సోలార్ గ్రామాలను ఏర్పాటు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఝాన్సీ రాణి, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, డ్వామా పీడీ సిద్ధలింగ మూర్తి, జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు, ఎల్డీఎం రామ్ ప్రసాద్, జిల్లా జీఎస్డబ్ల్యూఎస్ అధికారి, వెంకట్ రెడ్డి, గబ్రు నాయక్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
COMMENTS