చిలకలూరిపేట:77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు విశిష్ట సేవా పురస్కారాన...
చిలకలూరిపేట:77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు విశిష్ట సేవా పురస్కారాన్ని అందుకున్నారు. పల్నాడు జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చేతుల మీదుగా ఆయన ఉత్తమ ఈ ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కృష్ణారావు ఉన్నారు.
మున్సిపల్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ, పట్టణ అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారంలో చూపిన ప్రతిభకు గాను కమిషనర్‌కు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా శ్రీహరి బాబు మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఇది మున్సిపల్ సిబ్బంది సమిష్టి కృషి ఫలితమని పేర్కొన్నారు. భవిష్యత్తులో పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
COMMENTS