నరసరావుపేట: ఫిబ్రవరి 7,8 తేదీల్లో నిర్వహించనున్న కొండవీడు ఉత్సవాల కోసం కార్యక్రమాల జాబితా రూపొందించాలని అధికారులను జిల్లా కలెక్ట...
నరసరావుపేట: ఫిబ్రవరి 7,8 తేదీల్లో నిర్వహించనున్న కొండవీడు ఉత్సవాల కోసం కార్యక్రమాల జాబితా రూపొందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు.బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కొండవీడు ఉత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఉత్సవాల గురించి ప్రజల్లో ముందస్తుగా అవగాహన కల్పించేందుకు చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. మున్సిపాలిటీల్లో ర్యాలీలు నిర్వహించాలన్నారు.విద్యార్థులకు కొండవీడు చరిత్ర గురించి వ్యాస రచన పోటీలు నిర్వహించాలన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సాహపూరిత వాతావరణంలో ఫెస్ట్ నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆహ్లాదకరమైన సాంస్కృతిక కార్యక్రమాలు, పర్యాటకుల సంఖ్యకు తగినవిధంగా ఫుడ్ కోర్ట్ లు, స్టాల్ల్స్, త్రాగునీరు, టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు.
కొండవీడు ఫెస్ట్ నిర్వహణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి, నోడల్ అధికారిగా జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ ప్రియను నియమించారు.
కొండవీడు కోటకు చేరే రహదారులకు మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. పర్యాటకులను ఆకర్షించే కార్యక్రమాలు రూపొందించాలని ఈవెంట్ మేనేజర్ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, డిఆర్వో మురళి, ఆర్డీవో మధులత, తదితరులు పాల్గొన్నారు.
COMMENTS