నర్సరావుపేటలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలోమంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండత...
నర్సరావుపేటలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలోమంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండతిరునాళ్ల నిర్వహణపై మొదటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత విభాగాధిపతులు, అధికారులు పాల్గొని, మేళా నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.కలెక్టర్ మాట్లాడుతూ, కోటప్పకొండ తిరునాళ్లసందర్భంగా లక్షలాది భక్తులు రాష్ట్రంనలుమూలల నుండితరలివస్తారని, అందుకు తగిన విధంగా రవాణా, త్రాగునీరు, విద్యుత్, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా పర్యవేక్షణ బృందాలను నియమించి, బాధ్యతలు స్పష్టంగా విభజించాలని తెలిపారు.ఎలాంటి అవరోధాలు రాకుండా సమన్వయంతో అన్ని విభాగాలు ముందస్తుగానే ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పవిత్ర కోటప్పకొండ అనంతేశ్వరస్వామి దేవాలయంలో జరిగే ప్రతీ కార్యక్రమం సమయపాలనతో, భక్తిశ్రద్ధలతో జరగాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ,ఆర్డీవో, పోలీసు అధికారులు, అగ్నిమాపక, వైద్య, విద్యుత్,పంచాయతీ రాజ్, ఆర్టీసీ, దేవాదాయ శాఖాధికారులు పాల్గొన్నారు.
COMMENTS