పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో ప్రతిపాదిత “శ్రీ అగ్ని ఎంఎస్ఎంఇ పార్క్” పై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆధ్వర్య...
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో ప్రతిపాదిత “శ్రీ అగ్ని ఎంఎస్ఎంఇ పార్క్” పై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆధ్వర్యంలో డిపెక్ (D.I.P.E.C.) సమావేశం శుక్రవారం జరిగింది.ఇందులో పాల్గొన్న నానో టెక్నాలజీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏ.బి.ఎస్. శాస్త్రి, యూఎస్‌బీ ప్రాజెక్టు విశేషాలను కలెక్టర్‌కు వివరించారు. తమ సంస్థ గుంటూరులో చిన్న స్థాయి నానో టెక్నాలజీ తయారీ యూనిట్‌ను నడుపుతోందని, ఇది ఇస్రో, రక్షణ మరియు ఇతర అత్యాధునిక రంగాల అవసరాలను తీర్చగలదని తెలిపారు.శ్రీ అగ్ని ఎంఎస్ఎంఇ పార్క్‌లో సుమారు 30 నానో ఆధారిత టెక్నాలజీ యూనిట్లు నెలకొల్పనుండగా, రూ.200 కోట్ల పెట్టుబడితో 1500 మందికి పైగా ఉపాధి కల్పించగలదని ఏ.బి.ఎస్. శాస్త్రి వివరించారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, జిల్లాకు పరిశ్రమల రంగంలో కీలకమైన మైలురాయిగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.సమావేశంలో డి.ఐ.సి జి.ఎం శ్రీనివాస్, ఆర్ అండ్ బి ఈ.ఈ గీతా రాణి, ఏ.పీ.ఐ.ఐ.సి అధికారులు, ఏ.అజయ్ తదితరులు పాల్గొన్నారు.
COMMENTS