ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ గట్టు రంగారావు దంపతుల. చిలకలూరిపేట: పట్టణంలోని నేషనల్ హైవే నుండి పసుమర్తి బైపాస్, గొర్రెల సంత సమీ...
ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ గట్టు రంగారావు దంపతుల.
చిలకలూరిపేట: పట్టణంలోని నేషనల్ హైవే నుండి పసుమర్తి బైపాస్, గొర్రెల సంత సమీపంలోని మద్దుకూరి గార్డెన్స్‌లో ఆల్ఫా హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధులకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన పెయిడ్ ఓల్డ్ ఏజ్ హోమ్ సోమవారం ప్రారంభమైంది. ప్రముఖ వైద్యులు డాక్టర్ గట్టు రంగారావు దంపతులు ఈ ఆశ్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ గట్టు రంగారావు మాట్లాడుతూ, నిర్వాహకుడు కుంద రాంబాబు ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని,చిన్న పట్టణాల్లో ఇలాంటి వృద్ధాశ్రమాలు ఏర్పాటు అవడం ప్రశంసనీయం అని పేర్కొన్నారు.ప్రస్తుతం విదేశాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో చాలామంది తమ వృద్ధ తల్లిదండ్రులను చూసుకోలేని పరిస్థితి ఉందని, అలాంటి వారికి మానవతా దృక్పథంతో ఈ ఆశ్రమం ఆశ్రయం కల్పిస్తుందని అన్నారు.
వృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచడం సంతోషకరమని, ఆశ్రమం అభివృద్ధి చెందాలన్న ఆకాంక్ష వ్యక్తంచేశారు.నిర్వాహకుడు కుంద రాంబాబు మాట్లాడుతూ, వృద్ధులకు సేవ చేయడం తన జీవిత కల అని, దీనిని నెరవేర్చడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.ఆశ్రమం ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో నెలకొల్పి,సేవాతత్పరమైన సిబ్బందిని నియమించామని తెలిపారు.ప్రతి వారం వైద్యులు వచ్చి ఆరోగ్య పరీక్షలునిర్వహిస్తారని, 24 గంటలు నర్స్ మరియు కాంపౌండర్ అందుబాటులో ఉంటారని వెల్లడించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, వైద్యులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇతరులు పాల్గొన్నారు.
COMMENTS