ఎడ్లపాడు: పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.బీ.రవి డిసెంబర్ 1న ఎడ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) ఆకస్మికంగా తన...
ఎడ్లపాడు: పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.బీ.రవి డిసెంబర్ 1న ఎడ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) ఆకస్మికంగా తనిఖీ చేశారు.దిత్వా తుఫాను ప్రభావం నేపథ్యంలో గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకుతరలించే ఏర్పాట్లు చేయాలని సిబ్బందికిసూచనలు ఇచ్చారు.అలాగే పారిశుధ్య పరిస్థితులను పరిశీలించి,జ్వరాలు, వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా అన్ని నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్‌లు, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ (EHR), OP సేవల అమలు గురించి వివరాలు తెలుసుకున్నారు. పీహెచ్సీ పరిధిలో నిర్మాణంలో ఉన్న కొత్త బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ (BPHU) భవనం పనుల పురోగతిని కూడాపరిశీలించారు. ఈ సందర్భంగా డా.రవి మాట్లాడుతూ ఈ నెల 7న నియోజకవర్గ పరిధిలో వినికిడి లోపం ఉన్నవారి వివరాలు సేకరించి వారిని ప్రత్తిపాటి గార్డెన్‌లో జరిగే ప్రత్యేక వైద్య శిబిరానికి తీసుకురావాలని సూచించారు.
అలాగే డిసెంబర్ 21న జరిగే పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎడ్లపాడు పీహెచ్సీ వైద్యులు డా. పి. భరద్వాజ్, సూపర్వైజర్ వి. రాజశేఖర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
COMMENTS